మద్యంపై పన్ను రేట్లను సవరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏపీలో మద్యం ధరలు మండిపోతున్నాయి. పైగా తలో రకం కొత్త పేర్లతో బ్రాండ్లు వచ్చేశాయి. వీటిపై పన్నులు భారీగా ఉన్నాయని ప్రజలు, ముఖ్యంగా మద్యం ప్రియులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు మళ్ళీ మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ, రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది.
రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల కేసుకు 50% మేర వ్యాట్, రూ.400-2,500 మద్యం కేసుకు 60%, రూ.2,500-3,500 వరకు 55%, రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45% వ్యాట్ వసూల్‌కు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్ రూ.200 కంటే తక్కువున్న కేసుపై 50%, రూ.200 ఎక్కువ ఉంటే బీర్ కేసుపై 60% వ్యాట్ వసూలు చేయనుంది.