గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (14:43 IST)

పవన్‌కు అన్నా దూరం.. ఆయనకు భారం కాకూడదని... సింగపూర్‌లో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో భార్య కూడా ఆయనకు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలతో, మరో పక్క సినిమాలతో బిజీగా మారిపోయారు. దీంతో ఆయన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ భార్య అన్నా లెజినావో రష్యాలో ఉంటున్నట్లు సమాచారం. 
 
పవన్ రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆయనకు భారం కాకూడదని పిల్లల బాధ్యతలను ఆమెనే నెత్తిమీద వేసుకున్నారు. పిల్లల చదువుల రీత్యా ఆమె సింగపూర్‌లో సెటిల్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే అన్నా తమ ఇద్దరు పిల్లలతో సింగపూర్ లో సెటిల్ కానున్నారట.
 
అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో పవన్ పిల్లలకు సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువును వ్యతిరేకించిన ఆయన.. తన పిల్లలను మాత్రం విదేశాల్లో టాప్ స్కూల్ లో చదివించడం భావ్యమా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి పవన్ అభిమానులు ఘాటుగానే స్పందిస్తున్నారు.
 
పవన్ ఇంగ్లీష్ మీడియం చదువుకు వ్యతిరేకి కాదని. ఆయన ఏనాడూ ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అని చెప్పలేదని, అది పిల్లల తల్లిదండ్రుల ఇష్టమని, పిల్లకు ఎక్కడ చదవాలనుందో అక్కడ చదివించుకోవచ్చని మాత్రమే ఆయన అన్నారని తెలుపుతున్నారు. దీనిపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.ో