గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (12:26 IST)

సర్కారీ దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఎక్కడ?

ఆమె జిల్లా ప్రథమ పౌరుడు (కలెక్టర్) సతీమణి. కానీ, ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది మాత్రం ఓ ప్రభుత్వ దవాఖానాలో. ఈ అరుదైన దృశ్యం తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక జిల్లా కలెక్టర్ అంటే ఆషామాషీకాదు. సకల వసతులు అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ ఆమె వాటిన్నింటిని కాదని సర్కారు దవాఖానలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీత్‌ సతీమణి మాధవి భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం మగశిశువుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
గతంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ స్నేహలత జిల్లా ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే.జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ ఆమె సర్కారు దవాఖానలో గతనెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.