మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:21 IST)

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు: ఆరోగ్య శాఖ

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సర్వ జన ఆసుపత్రిలో  లాండ్రీ, డైట్, ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన పరిశీలించారు. 
 
రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యురిటి సిబ్బంది పని తీరు పై ఆయన సమీక్షించారు. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించకుండా చూడాలని ఆయన ఆదేశించారు. 
 
శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ముందుగా సూపరింటెండెంట్ ఛాంబర్ లో పలు అంశాలపై ఆయన సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రాజకుమారి, అనుపమాంజలి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, సివిల్ సర్జన్ ఆర్ యం ఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజు తదితరులు పాల్గొన్నారు.