బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (18:21 IST)

మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం... 4 ఛాన‌ళ్ళ‌పై నిషేధం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మీడియా బ్యాన్ లు రాజ‌కీయంగా కొన‌సాగుతూనే ఉన్నాయి... మొన్న తెలుగుదేశం పార్టీ నాలుగు ఛాన‌ళ్ళ‌ను బ్లాక్ లిస్ట్ లో ఉంచినట్లు ప్ర‌క‌టిస్తే, తాజాగా ఇపుడు వైసీపీ 4 ఛాన‌ళ్ళ‌ను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 
 
 
అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మీడియా సంస్థలను ఏపీ మంత్రి కొడాలి నాని దుయ్య‌ప‌ట్టారు. ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నుల‌ను కూడా ప్ర‌సారం చేయ‌లేని యాజ‌మాన్యాలు, కేవ‌లం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన అస‌త్య ప్ర‌చారాల‌ను భుజాన వేసుకుని ప్ర‌సారం చేస్తున్నార‌ని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.


క‌నీసం చంద్ర‌బాబు ఏం చెపుతున్నార‌నే ఆలోచ‌న కూడా చేయ‌ని, ఇంగిత జ్ణ్నానం లేని 4 ఛాన‌ళ్ళు బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈనాడు, ఈటీవీ,టీవీ 5, ఎబీఎన్ ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం అని మంత్రి చెప్పారు. వీటికి వైసీపీ నేత‌లు, మంత్రులు, నాయ‌కులు వెళ్ళ‌కూడ‌ద‌ని, ఇంట‌ర్య్యూలు ఇవ్వ‌కూడ‌ద‌ని, వారి కార్య‌క్ర‌మాల‌కు ఈ ఛాన‌ళ్ళ‌ను ఆహ్వానించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.