ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:59 IST)

అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం... మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, ఏప్రిల్ 12: యువతను ప్రోత్సహించి రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామని యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయ, నైపుణ్యా భివృద్ధి, నిరుద్యోగభృతి, ప్రవాసభారతీయుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సచివాలయం 2వ బ్లాకులోని తన చాంబర్ లో బుధవా

అమరావతి: యువతను ప్రోత్సహించి రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామని యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయ, నైపుణ్యా భివృద్ధి, నిరుద్యోగభృతి, ప్రవాసభారతీయుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సచివాలయం 2వ బ్లాకులోని తన చాంబర్ లో బుధవారం ఉదయం తనకు కేటాయించిన  శాఖ బాధ్యలను ఆయన స్వీకరించారు. ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతగల ఆరు శాఖలను తనకు అప్పగించినట్లు తెలిపారు. ఎన్నికల ముందు, తరువాత కూడా సీఎం యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఆదర్శవంతమైన యువతగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ భృతికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. అవసరమైతే ఈ నిధులను పెంచుతారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత అభిప్రాయాలను తెలుసుకొని నిరుద్యోగ భృతికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రోంలోని యువత ప్రపంచ స్థాయిలో నిలవాలన్నదే తమ ధ్యేయం అన్నారు. 
 
త్వరలో యూత్, స్పోర్ట్స్ పాలసీలు
 
త్వరలో యూత్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీలను రూపొందించనున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. మూడు వేల పాఠశాలల్లో గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రవాస భారతీయులను ప్రోత్సహించి వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రం పదకుండున్నర శాతం వృద్ధి రేటుతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. 
 
మచిలీపట్నం ప్రాంతం నుంచి దివిసీమను కలిపే  బ్రిడ్జి త్వరలోనే పూర్తి అవుతుందని మంత్రి చెప్పారు. రూ.65 కోట్లతో దానిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి కూడా త్వరలో పూర్తి అవుతుందని చెప్పారు. మచిలీపట్నం పోర్ట్ భూములు మూడు వేల ఎకరాల పోర్టుకు అప్పగించినట్లు తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెబుతూ అక్కడ భూములకు సంబంధించి ఏమీ సమస్యలు లేవని చెప్పారు. ఏవైనా ఉన్నా ఎంపీ గారు, తాను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ కు రైతులు సహకరించినట్లు చెప్పారు. 
 
చైనాలోని షాంగైలో కూడా ఇక్కడ మాదిరే వాతావరణం ఉన్నట్లు తెలిపారు. అందువల్ల అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కన్సెంల్టెంట్‌ని నియమించిన తరువాత వారు పోర్ట్ ప్లాన్ రూపొందిస్తారని, ఆ తరువాత పోర్టు పనులు మొదలు పెడతారని  మంత్రి రవీంద్ర వివరించారు.