గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:54 IST)

సీల్డు కవర్.. సీఎం చాంబర్.. సేఫ్ లాకర్... మంత్రిగారి భవితవ్యం భద్రం.. ఎవరాయన?

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి తన చాంబర్‌లోని సేఫ్ లాకర్‌లో భద్రపరిచారు. ఆ లాకర్ తాళం చెవిని తనవద్దే ఉంచుకున్నారు.

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి తన చాంబర్‌లోని సేఫ్ లాకర్‌లో భద్రపరిచారు. ఆ లాకర్ తాళం చెవిని తనవద్దే ఉంచుకున్నారు. అంటే ఆ మంత్రిగారి భవిష్యత్ సేఫ్ లాకర్‌లో ప్రస్తుతానికి భద్రంగా ఉంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరన్నదే కదా మీ సందేహం.. ఇంకెవరు... రావుల కిషోర్ బాబు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. 
 
ఇటీవల గుంటూరులోని తన ఇంటి నుంచి భద్రతా సిబ్బందిని కూడా వదిలేసి ఎటో వెళ్ళిపోయారు. సుమారు మూడున్నర గంటలపాటు వారికి ముచ్చెమటలు పట్టించారు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన నివాసం నుంచి వెళ్ళిపోయిన రావెల రాత్రి పదిన్నర గంటలకు తిరిగి వచ్చారు. అంతసేపూ ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియక అంతా హైరానా పడ్డారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికెళ్లింది. 
 
తన స్నేహితుడు రాంబాబు ఇంటికి భోజనానికి వెళ్లానని ఆయన చెప్పినా, సెక్యూరిటీ లేకుండా అంత హడావుడిగా వెళ్ళాల్సిన అవసరమేమిటన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ వైనం తెలుసుకుని ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి రావెల ఆ రోజు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో తెలుసుకోవలసిందిగా పోలీసులను, ఇంటలిజెన్స్ అధికారులను ఆదేశించారు.
 
దీనిపై ఆరా తీసిన ఇంటలిజెన్స్ సిబ్బంది.. రావెలను కలిసేందుకు ఆ రోజున సుమారు రెండు వందలమంది వచ్చారని, వాళ్ళు ఎందుకు వచ్చారో వారితో మంత్రి ఏం మాట్లాడారో తెలియజేస్తూ ఓ నివేదిక రూపొందించి సీల్డ్ కవర్‌లో బాబుకు అందజేసినట్టు తెలిసింది. ఆ కవర్‌ను చంద్రబాబు తన ఛాంబర్‌లోని సేఫ్ లాక్‌లో భద్రపరిచారట. ఈ కవరే రావెల రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.