గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం, మంత్రి గంటా ఇతర మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు సమాచారం.
వైకాపా ఎత్తులకు పైఎత్తులు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిపెట్టిన గంటాను ఈసారి జగన్ మోహన్ రెడ్డి పైన పులివెందులలో బరిలోకి దింపితే... అంటూ బాబు అన్నట్లు సమాచారం. ఈ మాటతో అక్కడున్నవారంతా కొద్దిసేపు ఆనందంతో నవ్వుకున్నారట. మొత్తమ్మీద కడప ఎమ్మెల్సీ సీటు సాధించడంతో తెదేపాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.