1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 జనవరి 2021 (18:45 IST)

పంచాయతీ ఎన్నికలపై చేతులెత్తేసిన పోలీస్ అధికారుల సంఘం, మా ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమంటూ?

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్థంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఆధిత్యనాథ్ మాత్రం ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పేశారు. చిన్నపిల్లలకు టీకాతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్ల అది సాధ్యం కాదని తేల్చేశారు.
 
ప్రభుత్వమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెబితే పోలీసులు కూడా అదే బాటలో నడిచారు. పోలీసు సంఘం నుంచి ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఏముందంటే మీ ఎన్నికల తొందర కోసం మా ప్రాణాలు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేం. గౌరవ ప్రధానమంత్రి కృషి, స్ఫూర్తితో యువ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో కోవిడ్ పైన నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ వల్ల ఇన్ని రోజుల శ్రమ వృధా అయ్యే అవకాశముంది.
 
అకస్మాత్తుగా విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల 109 మంది పోలీస్ సిబ్బంది ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. అనేకమంది ఇప్పటికే పాజిటివ్ సోకినవారిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో విధులు నిర్వర్తించడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు.