మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:42 IST)

భారత్‌ను హిందూదేశంగా మార్చేందుకే ఇదంతా.. ముస్లిం చట్టంలో వేలు పెట్టొద్దు: ఓవైసీ

ముస్లింలను అణగదొక్కి ఉమ్మ పౌరస్మృతిని తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. భారత్‌ను హిందూదేశంగా మార్చేందుకే కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోందని ఓవైసీ

ముస్లింలను అణగదొక్కి ఉమ్మ పౌరస్మృతిని తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. భారత్‌ను హిందూదేశంగా మార్చేందుకే కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోందని ఓవైసీ విమర్శలు కురిపించారు. 
 
ముస్లిం మహిళలకు హక్కులంటూ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలలో 7.36 కోట్ల మందికి పెళ్లిళ్లు జరగ్గా 2.70లక్షల ముస్లింలు మాత్రమే విడాకులు పొందారన్నారు. ఉలేమాలతో కూడిన ముస్లిం యునైటెడ్‌ ఫోరం(ఎంయూఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ముస్లింలను అణగదొక్కేందుకే ఉమ్మడి పౌరస్మృతిని తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని అసదుద్దీన్‌ ఆరోపించారు.
 
ముస్లిం పర్సనల్ చట్టంలో జోక్యాన్ని ముస్లింలు భరించరని ఓవైసీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని, గోవధపైనే 70 ఏళ్లుగా సంఘ్‌పరివార్‌ సంస్థలు మాట్లాడుతున్నాయని, దేశవ్యాప్తంగా మద్యనిషేధాన్ని అమలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా ఎవరూ అమలు చేయడంలేదన్నారు. 
 
బీజేపీ ప్రభుత్వానికి ముస్లిం మహిళలపై ప్రేమాభిమానాలు ఉంటే గుజరాత్‌లో 2002 ఊచకోతలో హత్యకు గురైన మాజీ ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రీ కేసులో దోషులను శిక్షించి ఆయన భార్య జకియాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేసి 24ఏళ్ల అవుతున్నా, దోషులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.