శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (16:07 IST)

కోడలికి మళ్లీ ఆడపిల్లే పుడుతుందన్న జ్యోతిష్యుడు.. అత్తమామల యాసిడ్ దాడి

తమ కోడలికి మళ్లీ ఆడపిల్లే పుడుతుందని జ్యోతిష్యుడి చెప్పిన మాటలు విన్న అత్తమామలు కోడలిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే ఒక అమ్మాయిని కన్న తమ కోడలు గిరిజ మళ్ళీ అమ్మాయినే కంటుందా... అని కోపం కట్టల

తమ కోడలికి మళ్లీ ఆడపిల్లే పుడుతుందని జ్యోతిష్యుడి చెప్పిన మాటలు విన్న అత్తమామలు కోడలిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే ఒక అమ్మాయిని కన్న తమ కోడలు గిరిజ మళ్ళీ అమ్మాయినే కంటుందా... అని కోపం కట్టలు తెంచుకున్న వాళ్లు యాసిడ్ తెప్పించి కోడలి కడుపుపై కుమ్మరించారు. ఆ అమాయకురాలు ఆ బాధను భరించలేక కేకలు పెట్టింది. ఆ కేకలు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
గత నెల 19వ తేదీన నెల్లూరులో జరిగిన ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గిరిజ ప్రస్తుతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గిరిజకు చికిత్స చేసిన డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమె అత్త మామను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితురాలిపై ఏ రకమైన యాసిడ్ పోశారో తెలుసుకోవడానికి పోలీసులు నమూనాలను రసాయన పరీక్షల కోసం పంపించారు.