గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (19:12 IST)

అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావ్: దేవినేని చందు

వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై టీడీపీ నేత దేవినేని చందు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావ్’’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఈ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టారన్నారు.


‘‘దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై మీ మిత్రబృందాన్ని పంపావు... నారా లోకేష్ నిన్ను తమ్ముడు అని సంభోదించారు...నీ స్వలాభం కోసం ఎంతమంది ప్రాణాలు తీస్తావు... నీకు కావాల్సింది అధికార దాహం ఒక్కటే... రాష్ట్ర తెలుగు యువత పదవి ఇచ్చారు.


నీకు గుడివాడ సీట్ ఇస్తే అదికూడా మార్చిపోయావు.. అవినాష్ ఈ సంఘటనతో నీ రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది’’ అని హెచ్చరించారు. దేవినేని అవినాష్ మిత్రబృందం ఇక్కడ కనపడ్డారు అని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారని దేవినేని చందు అన్నారు.