బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (13:21 IST)

శ్రీ‌ముఖిని భ‌ర్త‌గా హ‌క్కుతో లాగి కొట్టిన అవినాష్

Avinath-Srimukhi
శ్రీ‌ముఖిని లాగి త‌ల‌వెనుక ఫ‌డేల్‌మని కొట్టాడు ముక్కు అవినాష్‌. పైగా భ‌ర్త‌గా త‌న‌కు హ‌క్కువుంటుంద‌ని చెప్పాడు. దాంతో అత‌ని ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు లాక్కుంది శ్రీ‌ముఖి. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందోన‌ని తెలుసుకుందాం.
జ‌బ‌ర్‌ద‌స్త్‌లో స్కిట్ చేసిన‌ట్లుగానే ఇద్ద‌రూ క‌లిసి ఓ స్కిట్ చేశార‌న్న‌మాట‌.
`అయితే ట్రీట్‌మెంట్ తీసుకోనంటావా! 
తీసుకోను .. 
అయితే నేను తెచ్చిన మందుకు వేసుకోనంటావా?. పిల్ల‌ల‌కోస‌మైనా నీ పంతం వ‌దులుకోనంటావా? 
వ‌దులుకోను.
నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించ‌ద‌వా? 
నా చావు గురించి కూడా ఆలోచించ‌ను.. అంటూ స‌మాధానం చెప్పిన శ్రీ‌ముఖిని లాగి ఫెడేల్‌మ‌ని కొడ‌తాడు. ముక్కు అవినాష్‌. దాంతో షాక్ అయిన శ్రీ‌ముఖి.. వెన‌క్కి తిరిచూస్తుంది. ఎవ‌డే.. ఎవ‌డికి వుంటుంది. డాక్ట‌ర్‌కు వుంటుందా. సౌంద‌ర్య‌కు ఉంటుందా? అంటూ.. కొట్టే హ‌క్కు మొగుడికి వుంటుంది.. అంటూ క్లాస్ పీకుతాడు. వెంట‌నే ఏడుపు మొహంతో వున్న శ్రీ్ముఖి ముక్కు అవినాష్‌. ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు లాక్కుంటుంది. దీంతో క‌ట్ అంటూ.. అమె స్నేహితులు వ‌స్తారు.
 
ఇది కార్తీక దీపం సీరియ‌ల్‌లోని డాక్ట‌ర్‌బాబు, వంట‌ల‌క్క స‌స్నివేశం. అచ్చం వారు చేసిన‌ట్లుగా శ్రీ‌ముఖి, ముక్కు అవినాష్ భార్య‌బ‌ర్త‌లుగా అనుక‌రించారు. దీన్ని. శ్రీ‌ముఖి త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టింది. సో. ఇలా. శ్రీ‌ముఖి, అవినాష్ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు త‌మ నాట‌నాచాతుర్యాన్ని ఇలా ప్ర‌ద‌ర్శించార‌న్న‌మాట‌. కార్తీక‌దీపంలోని ఆ ఎపిసోడ్‌నే ఎందుకు ఎంచుకుందంటే, డాక్ట‌ర్‌బాబు లాంటి వ్య‌క్తి వ‌స్తే జీవితంలో ఆహ్వానిస్తాని ఓ సంద‌ర్భంలో అంద‌ట‌. అదీ సంగ‌తి.
తాజాగా శ్రీ‌ముఖి క్రేజీ అంకుల్స్ సినిమా చేసింది. థియేట‌ర్ల‌లో విడుద‌ల‌యితే అయింది కానీ. ప్రేక్ష‌కులే ఎందుక‌నో వెళ్ళ‌లేక‌పోయారు.