గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (17:05 IST)

సింగిల్‌గా రా.. ఎవడు పులో ఎవడు పిల్లో తేలిపోతుంది.. అయ్యన్న కౌంటర్

ayyanna patrudu
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అయితే విజయ్ సాయి రెడ్డి కొద్ది గంటల్లోనే ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డికి అయ్యన్న పాత్రుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. 
 
16నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదంటూ విమర్శించారు. 
 
బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ అంటూ అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
 
నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్‌గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో! అంటూ ట్విటర్ వేదికగా అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.