రుయా, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల సుందరీకరణ: తుడా చైర్మెన్ చెవిరెడ్డి

tuda meeting
ఎం| Last Updated: శనివారం, 31 అక్టోబరు 2020 (20:55 IST)
అత్యంత ప్రతిష్టాత్మకమైన రుయా, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల అవరణలో రోగులు, వారి బంధువులకు గతంలో నిర్ణయించినట్లుగా ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పనులు చేపట్టాలని తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం తుడా కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో ఎక్కడ జాప్యం నెలకొనరాదని స్పష్టం చేశారు.

టిటిడి తుడ కు అప్పగించిన డివైడర్ నిర్వహణ పనులు ప్రారంభించాలని సూచించారు. తుడా పాలకమండలి సమావేశంలో చర్చించిన అభివృద్ధి పనుల పై ఎప్పటికప్పుడు పురోగతిని తెలియజేయాలన్నారు.

అనంతరం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ఇఇ వరదా రెడ్డి, ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, రెవెన్యూ అధికారులు డెప్యూటీ కలెక్టర్ కిరణ్ కుమార్, ఎంపీడీవో లు సుశీల దేవి, రాధ తదితర అధికారులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :