శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (13:25 IST)

భారీగా పడిపోయిన పసిడి ధరలు, బంగారాన్ని వదలని కోవిడ్

అంతర్జాతీయ మార్కెట్ పై విపరీత ప్రభావం చూపుతున్న కోవిడ్ వైరస్.. బంగారాన్నీ వదల్లేదు. అంతర్జాతీయ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర భారీగా తగ్గింది.

రెండు రోజుల క్రితం1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి.. శుక్రవారం రాత్రి 12 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో 1,594 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఒకదశలో ట్రేడింగ్ 1,575 డాలర్లకు పడిపోయింది. ఇక క్రూడ్ విషయానికి వస్తే ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరింది.