మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (12:03 IST)

కొత్త కారు కొన్నాడు.. పార్టీ ఇచ్చాడు.. తిరిగి వస్తూ..?

road accident
తాడిపత్రిలో కొత్త కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
కొత్త కారు కొనడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చి.. ఆపై ఇంటికి వెళ్తుండగా.. కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.అంతే ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. ఇందుకోసం స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఇక పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. 
 
ఆ యాక్సిడెంట్‌లో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌, నరేశ్‌ రెడ్డి స్పాట్‌లోనే మ‌ృతి చెందగా. .మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీలో మద్యం సేవించి కారు నడపటం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు.