బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 28 అక్టోబరు 2017 (10:52 IST)

నారాయణ విద్యా సంస్థలు వర్సెస్ చైతన్య విద్యా సంస్థలు, కలిసి పనిచేయలేం...

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు కొట్టుకుంటున్నాయా అంటే అవుననే అనాల్సి వస్తోంది. చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి మంత్రి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారయణ చైతన్య విద్యా సంస్థలను వేధిస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. గత ఐదేళ

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు కొట్టుకుంటున్నాయా అంటే అవుననే అనాల్సి వస్తోంది. చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి మంత్రి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారయణ చైతన్య విద్యా సంస్థలను వేధిస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఎంతో సహనంతో అన్నీ భరిస్తున్నామనీ, నారాయణ విద్యాసంస్థలతో కలిసి ఇక పని చేయలేమని ఆమె తెలిపారు. ఈ కాలంలో తాము మోసాలను కూడా చూశామన్నారు. నారాయణ విద్యా సంస్థలతో కలిసి పనిచేయడం కష్టమనే తాము ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. 
 
కాగా నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణ మంత్రి కాక మునుపు ఈ రెండు విద్యా సంస్థలు విలీనమైన సంగతి తెలిసిందే. రైండు సంస్థల పేర్లను కలిపి 'చైనా' (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలుచుకోవడం మనకు తెలిసిందే. కాగా ఇటీవలి కాలంలో నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చేసుకోవడం, తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగడం తెలిసిందే. 
 
తమ విద్యా సంస్థలో వచ్చిన ర్యాంకులను నారాయణ విద్యా సంస్థ సాధించిన ర్యాంకులుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా... తమ విద్యా సంస్థలో చేరిన ముగ్గురు బాలురను నారాయణ సంస్థలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.