మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2023 (10:36 IST)

అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాజమండ్రి జైలులో నిరాహారదీక్ష

chandrababu naidu
తన అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో సోమవారం నిరశన దీక్ష చేస్తున్నారు. మరోవైపు ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ.. జనహితం కోరుతూ.. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్ష చేపట్టారు. 
 
తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి రోజున 'సత్యమేవ జయతే' పేరిట చేపట్టనున్న ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నాయకుల పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాల నుంచి సుమారు 8,000 మంది మహిళలు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
ఆ మేరకు స్థానిక క్వారీ సెంటర్‌ సమీపంలోని సుమారు నాలుగు ఎకరాల స్థలంలో రెండున్నర ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి సాయత్రం 5 వరకు ఈ నిరశన దీక్షసాగుతుంది. రాజమహేంద్రవరం విద్యానగర్‌లో బస చేసిన కేంద్రం నుంచి భువనేశ్వరి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సమీపంలో జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు 
 
అక్కడి నుంచి క్వారీ సెంటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలికి 10 గంటలకు చేరుకుని ‘సత్యమేవ జయతే’ దీక్షలో సాయంత్రం 5 గంటల వరకు కూర్చొన్నారు. దీక్ష విరమణ తర్వాత ఆమె ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.