శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 17 జులై 2017 (22:31 IST)

నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి వెంకయ్యనాయుడు... చంద్రబాబు

అమరావతి: నమ్మిన సిద్ధాంత కోసం నిరతరం పనిచేసే వ్యక్తి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వం ఖరారు చేయడం మన:స్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయన అభినందనలు తెలియజేశారు. సచివాలయంలోని

అమరావతి: నమ్మిన సిద్ధాంత కోసం నిరతరం పనిచేసే వ్యక్తి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వం ఖరారు చేయడం మన:స్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయన అభినందనలు తెలియజేశారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పని చేసి వ్యక్తి అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని కొనియాడారు. 
 
ఏనాడూ అధికారం కోసం ఆయన పాకులాడలేదన్నారు. విద్యార్థి దశ నుంచే పోరాట యోధుడిగా ఉన్నారన్నారు. ఆంధ్ర యూనివర్శిటీ లా విద్యార్థిగా జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. 1978లో తామిద్దరం ఒకేసారి అసెంబ్లీలోకి ప్రవేశించామన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గజగజలాడించారన్నారు. ఆగస్టు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచి, ప్రజాస్వామ్య పరిరక్షణకు విశేషంగా కృషి చేశారన్నారు. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరవాత తనదైన శైలితో, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. 
 
పోరాటాలతోనే పైకొచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. 1999 వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టన వెంకయ్యనాయుడు, 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఆ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారన్నారు. 2014 ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడి..వెంకయ్యనాయుడికి ప్రత్యేక గుర్తింపు నిచ్చారన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారని, తదనంతరం చేపట్టిన మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో కీలకమైన సమాచార శాఖ కట్టబెట్టారని గుర్తు చేశారు. 
 
పదేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించిన వెంకయ్యనాయుడు ప్రజాసమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించారన్నారు. తమ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలంటూ అనేక రాష్ట్రాల నేతలు ఆయనపై ఒత్తిడి తెచ్చారన్నారు. వెంకయ్యనాయుడు తమ రాష్ట్రం నుంచి వెళితే, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతునేది వారి నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ కష్టాలను రాజ్యసభలో గొంతెత్తిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని అన్నారు. విభజన తరవాత కూడా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 
 
వెంకయ్యకు ఆల్ ది బెస్ట్...మోడీకి అభినందనలు...
ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంపై వెంకయ్యనాయుడికి సీఎం చంద్రబాబునాయుడు ఆల్ ది బస్ట్ తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చిన ప్రధాని నరేంద్రమోడికి, ఎన్డీయే మిత్ర పక్షాలకు అభినందనలు తెలిపారు. ఉప రాష్ర్టపతి పదవికి ఆయన తగిన వ్యక్తి అని కొనియాడారు. ఉపరాష్ర్టపతిగా ఉంటూ రాజకీయాలు మాట్లాడలేపోయినా, ఏపీ అభివృద్ధికి మాత్రం ఆయన నిరంతరం కృషి చేస్తారనే ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తంచేశారు. ‘మనకు ఎన్నికష్టాలున్నా...ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి చేరుకుంటున్నప్పుడు స్వాగతించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ తరఫున గట్టి నాయకుడన్నారు. ఆయన ఏ పదవిలో ఉన్నా వన్నె తెస్తారన్నారు. వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వంపై అమిత్ షా తనతో ఫోన్లో మాట్లాడినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.  
 
మంత్రిమండలి సమావేశం వాయిదా...
మంగళవారం జరగాల్సిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నామినేషన్ కోసం ఢిల్లీ వెలుతుండడంతో, మంత్రి మండలి సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో సమావేశ తేదీని వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, కమిషనర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.