శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (10:55 IST)

రెండో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదనీ ఇంటర్ విద్యార్థిని సూసైడ్!!

చిత్తూరు జిల్లా రొంపిచర్లలోని ఇందిరమ్మ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తితో రెండో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇందిరమ్మ కాలనీకి చెందిన అమీర్‌ అనే వ్యక్తి రెండో కుమార్తె రేష్మా(17). ఇంటర్‌ మీడియట్‌ పూర్తి ఇంటిపట్టునే ఉంటోంది. అయితే, ఇదే కాలనీకి చెందిన ఇమ్రాన్‌ (27) అనే వ్యక్తి వలలో పడింది. మాయమాటలు చెప్పిన రేష్మాను ఇమ్రాన్ బుట్టలో వేసుకున్నాడు. ఈ క్రమంలో రేష్మా తొందరపడటంతో గర్భంధరించింది.
 
ఈ విషయం తెలిసిన రేష్మా తల్లిదండ్రులు షాక్‌కు గురై, ఇద్దరినీ హెచ్చరించారు. అంతేకాకుండా, ఇమ్రాన్‌కు ఇది వరకే వివాహమై ఒక కుమారై కూడా ఉందని తెలుసుకుని తమ కుమార్తెను చీవాట్లు పెట్టారు. కానీ, ఇమ్రాన్‌ తాను రెండో వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాడు.
 
అయితే రేష్మా తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఇష్టపడలేదు. రెండో భార్యగా వద్దంటూ కుమార్తెకు నచ్చచెప్పారు. అయినప్పటికీ, ఇమ్రాన్‌పై మనసు చంపుకోలేని రేష్మా... ఇంట్లోని పడక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన రేష్మాను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.