మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 2 మే 2016 (10:54 IST)

చిత్తూరు జిల్లా తవణంపల్లెలో యువతి దారుణ హత్య

చిత్తూరు జిల్లా నేరాలకు కేంద్రబిందువుగా మారిపోతోంది. రోజుకో హత్య, అత్యాచారాలు ఈ జిల్లాలో జరుగుతుండటంతో జిల్లా వాసులను భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లెలో మరో దారుణం జరిగింది. తవణంపల్లె మండలం కొంగారెడ్డిపల్లెకు చెందిన నజీర్‌ కుమార్తె ఆసియా (25) బెంగుళూరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేస్తోంది. 
 
రెండు రోజుల క్రితం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఆసియా ఆదివారం అర్థరాత్రి ఇంటి నుంచి బెంగుళూరు బయలుదేరింది. అయితే సోమవారం తెల్లవారుజామున మైనగుండ్లపల్లె మలుపు సమీపంలోని ఓ ఇంటిలో ఆసియా ఉరేసుకుని చనిపోయి ఉంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆసియా మృతదేహం వద్ద పోలీసులు పరిశీలించగా ఆమె శరీరంపై గాయాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా చంపి ఉరేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.