మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (11:23 IST)

లీకేజీకి పక్కా ప్లాన్? జగన్ ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయంటే...

అమరావతిలో నిర్మించిన తాత్కాలిక రాజధానిలోని అసెంబ్లీ భవన సముదాయంలో విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్‌లోకి నీళ్లు రావడానికి పక్కా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. నిజానికి అసెంబ్లీలో జగన్ ఛాంబర్‌లోకి నీళ

అమరావతిలో నిర్మించిన తాత్కాలిక రాజధానిలోని అసెంబ్లీ భవన సముదాయంలో విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్‌లోకి నీళ్లు రావడానికి పక్కా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. నిజానికి అసెంబ్లీలో జగన్ ఛాంబర్‌లోకి నీళ్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లోకి నీళ్లు రావడం ఏంటని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. జగన్ ఛాంబర్‌లో నీళ్లు పడుతున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవడంతో సామాన్య ప్రజలు కూడా అది నిజమేనేమోనని భావించారు. 
 
దీనిపై సీఎం చంద్రబాబు ఆ విషయంపై సీరియస్ అయ్యారు. అసెంబ్లీలోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలియజేయాలని సీఐడీని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగారు. నిర్మాణసంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలిసి సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు, మరో నలుగురు సీఐలు జగన్ ఛాంబర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. జగన్ ఛాంబర్‌ను పరిశీలించిన నిర్మాణ సంస్థల ఇంజినీర్లు సంచలన విషయాలను బయటపెట్టారు.
 
అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు, కేబుల్స్ వెళ్లేందుకు గోడల్లోంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారని, అయితే జగన్ పీఏ రూమ్‌పైన పీవీసీ పైపును ఎవరో కట్ చేశారని అధికారులు తెలిపారు. అసెంబ్లీ మొదటి అంతస్థులో వర్షపు నీరు వెళ్లే పైప్‌‌లైన్‌కి కొంచెం దూరంలో కేబుల్స్‌ వెళ్లే పీవీసీ పైప్‌ ఉందని, భారీ వర్షానికి స్లాబ్‌పై నీరు చేరడంతో కట్ చేసిన పైపు నుంచి వర్షపు నీరు లీక్ అయిందని అధికారులు నిర్ధారించారు. 
 
జగన్ ఛాంబర్‌పైన వర్షపు నీరు దిగే పైపు కత్తిరించి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పైపు కత్తిరంచడం వెనుక కుట్రకోణం ఉన్నట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. అసెంబ్లీ మొదటి అంతస్తులోకి నీరు రాకుండా నేరుగా జగన్ ఛాంబర్‌లోకి నీరు రావడం.. ఇప్పుడు అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. నీరు లీకవుతున్న సమయంలోనే జగన్ ఆఫీసు సిబ్బంది ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ పైపును ఎవరు కత్తిరించారనే దానిపై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు మొదలు పెట్టింది.