గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (11:44 IST)

మమ్మల్ని పట్టుకున్నారు సరే.. మరి కొకైన్ బ్యాచ్ కూడా ఉంది కదా.. ఎగదోసిన కెల్విన్

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల రాకెట్‌లో పట్టుబడ్డ కీలక నిందితుడు కెల్విన్ మరో బాంబు పేల్చాడు. మమ్మల్ని మీ పట్టుకుంటే మీకేమొస్తుంది. ఇంకో కొకైన్ బ్యాచ్ ఉంది మరి. ఆ బ్యాచ్‌ను పట్టుకుంటే సినిమా వాళ్లే కాదు రాజకీయ నాయకుల పిల్లల వ్యవహారం కూడా బయటకు వస్తుంది అ

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల రాకెట్‌లో పట్టుబడ్డ కీలక నిందితుడు కెల్విన్ మరో బాంబు పేల్చాడు. మమ్మల్ని మీ పట్టుకుంటే మీకేమొస్తుంది. ఇంకో కొకైన్ బ్యాచ్ ఉంది మరి. ఆ బ్యాచ్‌ను పట్టుకుంటే సినిమా వాళ్లే కాదు రాజకీయ నాయకుల పిల్లల వ్యవహారం కూడా బయటకు వస్తుంది అంటూ సిట్ అధికారులను ఎగదోశాడు కెల్పిన్. ‘‘మీరు (సిట్‌ అధికారులను ఉద్దేశించి) ఎల్‌ఎస్‌డీ బ్యాచ్‌ను మాత్రమే పట్టుకున్నారు. ఇంకా కొకైన్‌ బ్యాచ్‌ కూడా ఉంది. అందులో సినిమా, రాజకీయరంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు’’అని అతడు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
ఆదివారం రెండోరోజు బాలనగర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో సిట్‌ బృందం కెల్విన్‌ను విచారించింది. ఓ ప్రముఖ దర్శకుడు, ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్లే కాకుండా మరికొందరు సినిమావాళ్లు కూడా తన వద్ద డ్రగ్స్‌ తీసుకున్నట్లు కెల్విన్‌ ఒప్పుకున్నట్లు తెలిసింది. డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ సిట్‌ విచారణలో కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలిసింది.  కొందరు కొకైన్‌ తీసుకోవటాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారని కెల్విన్‌ చెప్పినట్టు తెలిసింది. 
 
తెలుగు సినిమా రంగంలో అగ్రస్థానంలో ఇద్దరు నిర్మాతలు, మరో ఇద్దరు నిర్మాతల కొడుకులు, ఓ రాజకీయ ప్రముఖుడి కొడుకు ఇందులో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. జీషన్‌ అలీఖాన్‌ గ్యాంగ్‌తోపాటు మరికొన్ని గ్యాంగులు కొకైన్‌ సరఫరా చేస్తాయని, జీషన్‌ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నట్టు తెలిసింది. 
 
సాధారణ రోజుల్లో రోజుకు 500 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు విక్రయిస్తామని, వీకెండ్‌లో మాత్రం 1500 వరకు విక్రయిస్తామని కెల్విన్ చెప్పినట్టు సమాచారం. వినాయక నిమజ్జనం చివరి నాలుగైదు రోజుల్లో డ్రగ్స్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందని వివరించినట్లు తెలిసింది. ఊరేగింపు సమయంలో.. శరీరంలో గంటలకొద్దీ శక్తి ఉండేందుకు డ్రగ్స్‌ తీసుకుంటారని అతడు చెప్పినట్టు తెలిసింది.