శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (22:10 IST)

జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..సమావేశంలో ఏం జరిగిందంటే?!

క్యాంప్ కార్యాలయంలో సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, రాజమౌళి, దిల్ రాజు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ విజయ్ చందర్, తదితరులు ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్రంలో షూటింగ్‌లకు ముందుగానే అనుమతి ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, ఇతర సమస్యలను తాము ప్రస్తావించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సినీ ప్రముఖులు తెలిపారు.

రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం హామీ తమకు ఎంతో ఆనందం కలగజేసిందని వారు అన్నారు.