శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (18:57 IST)

తాత రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్ బ్యాటింగ్ చేసిన సీఎం జగన్ (Video)

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడారు. తన తాత వైఎస్ రాజారెడ్డి పేరుమీద కడప జిల్లాలో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేశారు. 
 
అంతకుముందు.. ఈ నూతన స్టేడియంలో సీఎం జగన్ ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం జగన్ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 
బ్యాటింగ్ స్టాన్స్, గ్రిప్, ఆయన బంతులను లెగ్ సైడ్ వైపు తరలించిన విధానం అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సీఎం జగన్ పక్కా క్రికెటింగ్ షాట్లు ప్రదర్శించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వన్ మోర్, వన్ మోర్ అంటూ మరికొన్ని బంతులు ఆడాలని ఆయనను ఉత్సాహపరిచారు. దీంతో ఆయన కొన్ని నిమిషాల పాటు క్రికెట్ ఆడారు.