శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 జనవరి 2025 (20:35 IST)

cock fight: 10 నిమిషాల్లో యజమానికి కోటి రూపాయలు తెచ్చిన కోడిపుంజు

cock that won one crore
కేవలం పది నిమిషాల్లో తనను పెంచిన యజమానికి ఏకంగా కోటి రూపాయలు తెచ్చిపెట్టింది ఆ కోడిపుంజు. sankranti cock fight సంక్రాంతి కోడి పందేలు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని తాడేపల్లిగూడెంలో కోటి రూపాయల మేర పందెం కాసారు. ఈ పందెం వీక్షించేందుకు పొరుగున వున్న ఊళ్ల నుంచి పెద్దఎత్తున ప్రజలు వచ్చారు.
 
తాడేపల్లిగూడెంలో జరిగిన పందెంలో గుడివాడ ప్రభాకర్ రావుకి చెందిన నెమలి పుంజు, రత్తయ్యకి చెందిన రసంగి పుంజు పోటీపడ్డాయి. ఈ పోటీలో రసంగి పుంజును ఓడించిన నెమలి పుంజు యజమాని ప్రభాకర్ రావుకి కేవలం 10 నిమిషాలలో కోటి రూపాయలు తెచ్చి పెట్టింది.