శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:46 IST)

సహజీవనం చేశాడు.. పసుపు తాడు కట్టాడు.. గర్భవతిని చేశాడు.. ముఖం చాటేశాడు..

మానవీయ విలువలు సన్నగిల్లుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి పసుపుతాడు కట్టాడు. ఆపై యువతిని గర్భవతిని చేశాడు. తర్వాత ముఖం చాటేశాడు. ఈ ఘటన హైదరాబ

మానవీయ విలువలు సన్నగిల్లుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి పసుపుతాడు కట్టాడు. ఆపై యువతిని గర్భవతిని చేశాడు. తర్వాత ముఖం చాటేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతానికి చెందిన యువతి(32) ఫిలింనగర్‌లో నివాసం ఉంటూ టోలీచౌకిలోని ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. తన బంధువు ద్వారా పరిచయం అయిన సుధాకర్ అనే వ్యక్తి పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేశారు. 
 
ఇటీవల యువతి పెళ్లి చేసుకోమని సుధాకర్‌ను అడిగింది. దీంతో ఆమె మెడలో పసుపుతాడు కట్టాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన విషయం తెలిసిన సుధాకర్ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.