శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 15 సెప్టెంబరు 2018 (09:37 IST)

ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఎక్కడ?

కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూలులో మూడో తరగతి విద్యార్థినిపై ఓ కామాంధుడు అ

కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూలులో మూడో తరగతి విద్యార్థినిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన టోలిచౌకి అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. గత కొద్దిరోజులుగా చిన్నారి నీరసంగా కనబడటంతో తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. ముక్కుపచ్చలారని తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే స్కూల్ యాజమాన్యంలో ఓ వ్యక్తిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తి వద్ద పోలీసులు విచారణ జరిపారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.