సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (13:31 IST)

బీజేపీ అడుక్కోదు.. టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందా? పురంధేశ్వరి ఏమన్నారు?

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడం పట్ల బీజేపీ రాష్ట్ర మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడం పట్ల బీజేపీ రాష్ట్ర మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటును ఏపీ కోటాలో ఇవ్వాలని తామేమీ తెలుగుదేశం పార్టీ నేతలను కోరలేదన్నారు.
 
అయితే, సురేష్ ప్రభుకు సీటు కావాలని తాము కోరామా లేదా ఆఫర్ టీడీపీ నుంచే వచ్చిందా? అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలనే అడిగి తెలుసుకోవాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరిన కారణంగానే సురేష్ ప్రభుకు టికెట్ ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకోవడాన్ని ఖండించారు. ఏదీఏమైనా రైల్వే మంత్రి ఏపీకి నుంచి రాజ్యసభకు వెళ్లడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు.