దాసరి కుమారుడు కావాలనే అలా చేశారట.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి?

Last Updated: బుధవారం, 19 జూన్ 2019 (19:18 IST)
దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. మంగళవారం సాయంత్రం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.


జూన్ 9న బయటకి వెళ్లిన దాసరి ప్రభు కనపడటం లేదని.. ఇంటికి చేరుకోలేదని ఆయన మామయ్య సురేంద్రప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ప్రభు కావాలనే తన ఫోనును అందుబాటులో లేకుండా చేసినట్లు పోలీసులు భావించారు. ఆయన తన మొదటి భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అనుమానించారు. 
 
చిత్తూరులోని తన మొదటి భార్య ఇంటికి వెళ్లినట్లు తాజాగా ప్రభు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇంటికి తిరిగొచ్చిన దాసరి ప్రభును పోలీసుల అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత చదవండి :