శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (10:33 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండ

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండంగా మారి ప్రభావం చూపుతుంది. ఫలితంగా జూలై 16, 17, 18 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవన కాలంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. ఆ జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే సూచనలున్నాయి.