మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (18:35 IST)

గ‌వ‌ర్న‌ర్, సీఎంల‌ను క‌లిసిన శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌

శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న సోమ‌వారం ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ని విజ‌య‌వాడ‌లోని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో క‌లుసుకున్నారు.

మ‌ర్యాదపూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి పుష్ప‌గుఛ్చాన్ని అంద‌జేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌తో ముఖాముఖి సంభాషించారు. శ్రీలంక‌లో ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా ప్ర‌భావంపై కూడా ఆయ‌న సంభాష‌ణ చేసిన‌ట్లు తెలుస్తోంది.
 
అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్ క‌లుసుకున్నారు. డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్‌ను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేశారు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.