శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (09:07 IST)

మితిమీరి జోక్యం చేసుకున్నా.. నన్ను క్షమించు జగన్: గవర్నర్ నరసింహన్ భావోద్వేగం

తాను తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరారు. తనకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందన్న నరసింహన్.. 1951లో విజయవాడలోనే తనకు అక్షరాభ్యాసం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. అసెంబ్లీలో జగన్ అనుసరిస్తున్న తీరు బాగుందని, చివరి వరకు ఇదే పంథా అనుసరించాలని కోరారు. నరసింహుడే ఏపీని రక్షిస్తాడని అన్నారు.

తన సలహా మేరకే జగన్  మంగళగిరి నరసింహుణ్ని దర్శించుకున్నారని గవర్నర్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో మితిమీరి జోక్యం చేసుకున్నందుకు జగన్ తనను క్షమించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని నరసింహన్ వివరించారు.