గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 3 ఆగస్టు 2017 (15:33 IST)

ఏపీలో ఏం చేసేది...? వాపోతున్న నాయకుడెవరు?

డిగ్గీ రాజా... దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పేరు బాగా ఫేమస్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానంలో ఈయనో కీలక వ్యక్తి. ఈయన ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే. అయితే పార్టీ ఓడిపోయిన తరువాత డిగ్గీ రాజా ఆ పార్టీలో ఉన్నారు కానీ సరిగ్గా పనిచేయలేదన్

డిగ్గీ రాజా... దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పేరు బాగా ఫేమస్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానంలో ఈయనో కీలక వ్యక్తి. ఈయన ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే. అయితే పార్టీ ఓడిపోయిన తరువాత డిగ్గీ రాజా ఆ పార్టీలో ఉన్నారు కానీ సరిగ్గా పనిచేయలేదన్న విమర్సలను బాగానే మూటగట్టుకున్నారు. అధిష్టానం వద్ద మైనస్ మార్కులు సంపాదించుకున్న డిగ్గీ రాజాకు ఎంత కష్టమొచ్చిందో తెలిస్తే నవ్వుకోక తప్పదు.
 
దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ అంటే ఈయనే.. ఈయనంటేనే కాంగ్రెస్ పార్టీ. అలా ఉండేది మొదట్లో. అటు ఎపి, ఇటు తెలంగాణా రాష్ట్రాలకు దిగ్విజయ్ సింగ్‌ను ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. ఎపిలో అయితే కాంగ్రెస్ చచ్చిపోయిందని అధికార, ప్రతిపక్ష నేతలు చెబుతుంటే తెలంగాణాలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. కారణం రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది కాబట్టి ప్రజలు ఆ మాత్రం ఓట్లు వేశారు.
 
ఇదంతా బాగానే ఉన్నా ప్రతిపక్ష పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇన్‌ఛార్జ్ ప్రయత్నించాలి. కానీ డిగ్గీ రాజా మాత్రం ఆ పని అస్సలు చేయలేదు. తెలంగాణా రాష్ట్రంలో దిగ్విజయ్ పర్యటించినప్పుడల్లా అన్నీ గొడవలే.. కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా కొట్టుకున్నారు. అయినా తనకేం సంబంధం లేదన్నట్లు వారిని బుజ్జగించడం మానేశారు దిగ్విజయ్. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాల్సింది పోయి దిగ్విజయ్ ఆ నమ్మకాన్ని పోగొట్టేలా ప్రవర్తించారు.
 
ఇది కాస్తా గత కొన్నినెలల ముందు తెలంగాణా పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీకి తెలిసింది. ఇంకేముంది డిగ్గీ రాజాకు కొన్ని రోజులు అవకాశం ఇచ్చి వెంటనే ఆ పదవి నుంచి తప్పించేశారు. కేవలం ఎపికి ఇన్‌ఛార్జ్ మాత్రమే దిగ్విజయ్‌ను కొనసాగిస్తున్నారు. తనను పదవి నుంచి తొలగించడంపై దిగ్విజయ్ అటు సోనియాగాంధీ, ఇటు రాహుల్ గాంధీలపై కోపంతో ఉన్నారట. ఎపిలో నేనేమీ చేస్తాను.. నేనేమీ పట్టించుకోనంటూ సన్నిహితులతో వాపోయారట. అది నిజమే కదా... ఏపీలో అసలు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరాయె.