బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (16:28 IST)

ఆంధ్రప్రదేశ్ లో దిశ పోలీసు స్టేషన్ల పని తీరు భేష్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దిశ పోలీస్ స్టేష‌న్ల గురించి రాజ‌కీయ విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండ‌గా, అత్యున్న‌త స్థాయి క‌మిటీ మాత్రం దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను కొనియాడింది. వీటి ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంసించింది. భారత పార్లమెంట్ తరఫున మహిళా భద్రత కమిటీ శనివారం విశాఖపట్నంలోని దిశ పోలీసు స్టేషన్ ను సందర్శించింది. 
 
డాక్టర్ హీనా విజయ్ కుమార్ గావిట్ అధ్యక్షతన ప్ర‌తినిధి బృందం ఒక రోజు విశాఖ‌లో పర్యటించింది. దిశ పోలీస్ స్టేషన్ పని తీరుతో పాటు అక్కడ జరిగే కార్యకలాపాల గురించి వారికి సవివరంగా దిశ స్పెషల్ అధికారిని డి.ఐ.జి. రాజకుమారి, విశాఖ సీపి మనీష్కుమార్ సిన్హా వివ‌రించారు. 
 
దిశ పోలీస్ స్టేషన్ ను క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ సభ్యులు బాధిత మహిళల,  చిన్నారుల భద్రత, పరిరక్షణకు ఎపి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలను  కొనియాడారు. ఇక్క‌డ ప్రాక్టీస్ అంతా భేష్ అని పార్లమెంట్ మహిళా భద్రత కమిటీ బృందం కితాబు ఇచ్చింది.