ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:54 IST)

కొత్త సంవత్సర వేడుకలొద్దు.. నన్ను కలవడానికి రావద్దు.. చింతకాయల అయ్యన్న

Ayyanna Patrudu
Ayyanna Patrudu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర వేడుకలకు ముందు కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవవద్దని అభ్యర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరపు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం లేదా అందులో పాల్గొనడం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అంతేగాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షల కోసం జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలవడం శుభాకాంక్షలు తెలపడం మానుకోవాలని కోరారు. 
 
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు.