శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై హెచ్ఐవీ రక్తం చల్లిన డాక్టర్.. ఎక్కడ?

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అదే ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు ఒకడు హెచ్ఐవీ రక్తాన్ని చల్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అదే ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు ఒకడు హెచ్ఐవీ రక్తాన్ని చల్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేవిడ్ రాజ్ అనే వ్యక్తి ఎముకల వైద్య నిపుణుడు (ఆర్థోపెడీషియన్)గా పనిచేస్తున్నాడు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌గా లక్ష్మీ ప్రసాద్‌ కొనసాగుతున్నారు. ఆస్పత్రి తనిఖీల్లో భాగంగా, సూపరింటెండెంట్ రాత్రిపూట వార్డులో రౌండ్లు నిర్వహిస్తూ పర్యవేక్షించేవారు.
 
ఇలా రౌండ్లు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీ ప్రసాద్‌పై డేవిడ్ రాజ్ హెచ్‌వీఐ కలిగిన రక్తాన్ని స్ప్రే చేశాడు. అయితే ఆ రక్తాన్ని ఇంజెక్ట్ చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
ఈ విచారణలో సూపరింటెండెంట్‌పై రక్తాన్ని చిమ్మినట్టు డేవిడ్ రాజ్ అంగీకరించాడు. తనను లాంగ్‌లీవ్‌పై ఆసుపత్రి నుంచి వెళ్లమని చెప్పడంతో అతడిని భయపెట్టాలనే అలా చేసినట్టు వివరించాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సేవల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జయరాజ్ విచారణకు ఆదేశించారు.