ద్యావుడా...! వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవు... ఐనా ఆ రోజు పనిచేస్తారట!
విజయవాడ: ఈ ఆధునిక యుగంలో ఉదయం లేచింది మొదలు బ్యాంకులు, ఏటీఎంలతోనే పని. వ్యాపారులకు అయితే నిత్యం లావాదేవీలుంటాయి. ఒక్కరోజు బ్యాంకు లేకపోతే పని గడవదు... అలాంటిది ఈ దసరాలో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. సినీ డైలాగ్ మాదిరి ద్యావుడా
విజయవాడ: ఈ ఆధునిక యుగంలో ఉదయం లేచింది మొదలు బ్యాంకులు, ఏటీఎంలతోనే పని. వ్యాపారులకు అయితే నిత్యం లావాదేవీలుంటాయి. ఒక్కరోజు బ్యాంకు లేకపోతే పని గడవదు... అలాంటిది ఈ దసరాలో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. సినీ డైలాగ్ మాదిరి ద్యావుడా అంటూ వ్యాపారులు వణికిపోతున్నారు. కానీ, బ్యాంకుల పని దినాలపై ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది.
వచ్చే నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో 2016 అక్టోబర్ 10న బ్యాంకులు పని చేయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అక్టోంబర్ 8న రెండో శనివారం, 9న ఆదివారం, 10న ఆయుధ పూజ, 11న విజయదశమి, 12న మొహర్రం పండుగల కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
అయితే వరుసగా మూడు రోజుల మినహా ఎక్కువ రోజులు బ్యాంకులు సెలవులు పాటించకూడదనే నిబంధనతో ఆ రోజుల్లో ఒకరోజు పనిదినాన్ని పాటించాలని బ్యాంకులు నిర్ణయించాయి. అక్టోబర్ 10 ఆయుధ పూజ రోజున బ్యాంకులు పనిచేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది.