బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:50 IST)

నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు-ఈసీ

తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మాట్లాడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్.. తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ఊహాగానాలకు తావులేదన్నారు. 2002 సుప్రీంకోర్టు రూల

తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మాట్లాడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్.. తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ఊహాగానాలకు తావులేదన్నారు. 2002 సుప్రీంకోర్టు రూల్ ప్రకారం అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు జరపాల్సి ఉంటుందని గుర్తు చేశారు. 
 
6 నెలల పాటు అపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రావత్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికల శంఖం పూరించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 
 
మరోవైపు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్  కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇంకా గులాబీ దళంలో చేరిపోయారు. తెలంగాణ కోసం తొలి నుంచి పోరాడిన టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు సురేష్ రెడ్డి ప్రకటించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ప్రస్తుత సమయంలో సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని ఇందుకోసమే టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నానని ఆయన అన్నారు.