ట్రస్ట్ నడుపుతున్నానని నమ్మించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఏం చేశాడంటే...
గుంటూరులో పెనమలూరులో చీటింగ్ కేసు నమోదైంది ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి నుంచి సొమ్ము స్వాహా చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి నితీష కానూరు సూపర్‌వీజ్ అకాడమ
గుంటూరులో పెనమలూరులో చీటింగ్ కేసు నమోదైంది ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి నుంచి సొమ్ము స్వాహా చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి నితీష కానూరు సూపర్‌వీజ్ అకాడమీ వద్ద ఉంటుంది.
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వంశీమనోహర్ తాను ఏపీ క్రికెట్ టీమ్ ఫ్లైయర్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని, క్రీడల్లో రాణించాలన్నా తన ట్రస్ట్ నుంచి పంపిస్తామని చెప్పి యువతి నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత వంశీమనోహర్ ఆచూకీ లభించక పోవడంతో ఆ యువతి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.