ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (10:22 IST)

తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి నుండి సినిమా ప్రదర్శనలు!

తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే దీపావళి నుండి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించడం జరిగిందని జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది.

ఈసందర్భంగా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్  ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15 నుండి సినిమా ప్రదర్శనలకు అనుమతించడం జరిగిందని, ఇందుకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

కొన్ని సాంకేతిక కారణాలతో థియేటర్లు తెరవడానికి సాధ్యం కావడం లేదని,సినీ నిర్మాతల సహకారంతో దీపావళికి థియేటర్లు తెరిచేందుకు నిర్ణయించామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ ఫిక్సెడ్ చార్జీలు మాఫీ చేస్తామని సినీ పెద్దల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

కార్యక్రమంలో అత్తి సత్యనారాయణ, లక్ష్మీ థియేటర్ శ్రీను, గీతా వెంకటేశ్వరరావు, జేకే రామకృష్ణ, పిఠాపురం పెదబాబు, చినబాబు, గౌరీశంకర్, హరిబాబు, స్వామి బాబు, చిన్ని తదితరులు పాల్గొన్నారు.