శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (17:11 IST)

ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం

వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఐదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గోలీలపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గోలీలపేట శివారులో బాలిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.