టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. శనివారం రాత్రి అమరావతి పరిధిలోని ఉద్ధండరాయుని పాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు.
ఈ నేపథ్యంలో రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, సురేశ్ ఇంటికి బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడ రాజుపై నందిగం సురేశ్, అతని సోదరుడు ప్రభుదాస్ దాడి చేశారని బాధితుడు భార్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేశ్‌పై కేసు నమోదు చేసి విరాచరణ జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న సురేశ్ సోదరుడు ప్రభుదాస్, అతని బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నందిగం సురేశ్ అరెస్టుపై ఆయన భార్య మండిపడ్డారు. తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది.