బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 మే 2020 (21:30 IST)

దొంగ బంగారం పేరుతో టోకరా!.. ముగ్గురు అరెస్టు

కృష్ణాజిల్లా కైకలూరు మండలం వెమవరప్పాడులో దొంగ బంగారం పేరుతో మోసగించిన మహిళతో పాటు మ‌రో ఇద్దరిని పోలీసులు బుధ‌వారం అరెస్ట్ చేశారు. 

డీఎస్పీ సత్యానందం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కైకలూరులోని ఓ ఫాస్టర్, మరో వ్యక్తికి దొంగ బంగారం చూపించి రూ.3.30 ల‌క్ష‌లు ముగ్గురు సభ్యుల ముఠా దోచుకున్నార‌ని తెలిపారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల నుండి రూ.4.50 లక్షల నగదు, 53 నకిలీ బంగార‌పు కాయిన్స్, నాలుగు ద్విచక్ర వాహనాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులకు దొంగ నోట్లు మార్పిడి చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆ దిశ‌గా విచార‌ణ సాగిస్తున్న‌ట్లు ‌డీఎస్పీ సత్యానందం తెలిపారు.