శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (11:08 IST)

అనంతపురం ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్...

అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కదిరిలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి.

అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కదిరిలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల రోజున ఆలయానికి స్థానికంగా నివశించే ఇంటర్ చదివే విద్యార్థిని వెళ్లింది. ఈ బాలికను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వా వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురి కోసం వెతుకులాట ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.