మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జులై 2019 (10:05 IST)

గ్యాస్‌ ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా : జేసీ మార్కండేయులు

తిరుపతి ఎల్‌పీజీ సిలెండర్‌ను వినియోగించే ప్రతి వినియోగదారుడికి ఎల్‌పీజీ ప్రమాద బీమా రక్షణ పాలసీ అందుబాటులో ఉంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ మార్కండేయులు పేర్కొన్నారు. 
 
గురువారం జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన 'గ్యాస్‌ సిలెండర్‌ వినియోగదారుల బీమా రక్షణ.. గ్యాస్‌ వాడకంలో భద్రతా సూచనలు' అనే కరపత్రాల్ని జేసీ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ గ్యాస్‌ వినియోగంలో ప్రమాదం జరిగితే ప్రతి వ్యక్తికి వైద్య ఖర్చులకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బీమా సొమ్ము పొందవచ్చని తెలిపారు. ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా వస్తుందని వెల్లడించారు. 
 
ఎల్‌పీజీ వినియోగదారులు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎల్‌పీజీ డీలర్‌కు, అగ్ని ప్రమాద అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేసి ప్రాంతీయ బీమా కార్యాలయం ద్వారా సహాయాన్ని పొందొచ్చని తెలిపారు. 
 
దీనిపై ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు ప్రజలను చైతన్యం వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పి.రాజారెడ్డి, కార్యదర్శి ఎం.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, ఎస్‌.రామారావు, ఎన్‌.శేషాద్రి, ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.