మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (09:51 IST)

ప్రేమ పేరుతో గర్భం చేశాడు... పెళ్లి మాటెత్తగానే పత్తాలేకుండా పోయాడు!

ప్రేమ.. ప్రేమ.. అని అమ్మాయిల వెంటపడడం... ప్రేమ పేరుతో గర్భవతిని చేసి.... తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మాట మార్చడం... ఈ రోజుల్లో చాలామంది ఆకతాయిలకు ట్రెండ్ అయిపోయింది. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ

ప్రేమ.. ప్రేమ.. అని అమ్మాయిల వెంటపడడం... ప్రేమ పేరుతో గర్భవతిని చేసి.... తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మాట మార్చడం... ఈ రోజుల్లో చాలామంది ఆకతాయిలకు ట్రెండ్ అయిపోయింది. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖపట్నం లోని గాజువాకలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఇదే గ్రామంలో ఓ మహిళ ఇళ్ళలో పని చేసుకుంటూ తన కూతురిని (21)ని పోషిస్తూ వచ్చింది.
 
ఈ నేపథ్యంలో దుర్గారెడ్డి (27) అనే యువకుడితో ఈ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ యువకుడి బతుకు జీవనం కోసం ఆటో నడుపుతుండేవాడు. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దుర్గారెడ్డి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా అమ్మాయికి ఏడో నెల రావడంతో పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో అతడు.. బలం మాత్రల పేరుతో రెండు వారాల క్రితం ఆమెకు అబార్షన్‌ మాత్రలు తెచ్చిచ్చాడు. వాటిని వేసుకోవడంతో జూలై 28 నుంచి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. మాత్రల కారణంగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆమె ప్రసవించింది.
 
ఆ విషయం కుటుంబసభ్యులకు చెప్పకుండా బిడ్డను అక్కడే వదిలి కడుపునొప్పిగా ఉందంటూ తల్లి, తమ్ముడిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. ఇంటికొచ్చిన ఆమె సోదరుడు బాతురూమ్‌లో బిడ్డ అరుపులు వినడంతో వెళ్లి చూడగా ఆడ శిశువు కనిపించింది. దీంతో బిడ్డను ఆసుపత్రికి తరలించాడు. అక్కడ రెండు రోజులు చికిత్స అనంతరం బిడ్డ కన్నుమూసింది. విషయం బయటపడటంతో తల్లిదండ్రులతో కలిసి ఆస్పత్రికి వచ్చిన దుర్గారెడ్డి ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.
 
తీరా వాళ్ల ఊరు వెళ్లాక కుదరదని తేల్చిచెప్పేశారు. దీంతో యువతి బంధువులు ఆమెకు న్యాయం చేయాలంటూ ఆదివారం చిల్లపేట వెళ్లకు వెళ్లారు. ఈ విషయాన్ని చెప్పి గ్రామపెద్దలను ఆ యువతి కలవడంతో విషయం తెలుసుకున్న దుర్గారావు గ్రామం నుంచి పారిపోయాడు. గ్రామపెద్దలు చేసేదేమీ లేక గాజువాకలో ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చి తిరిగి పంపించేశారు.