వ్యాయామం పేరుతో 8 మంది విద్యార్థినిలపై పీఈటీ మాస్టర్ అత్యాచారం!
వ్యాయామం పేరుతో 8 మంది విద్యార్థినిలపై పీఈటీ మాస్టర్ అత్యాచారం
వ్యాయామం పేరుతో ఎనిమిది మంది విద్యార్థినిలపై ఓ పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అత్యాచారం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... నెల్లూరు జిల్లా బీవీ నగర్లో మునిసిపల్ పాఠశాల ఉంది. ఇక్కడ పీఈటీ మాస్టర్ అజయ్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన మైదానంలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాయామం నేర్పిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వయసుకు వచ్చిన ఎనిమిది మంది విద్యార్థినిలపై ఒకరికి తెలియకుండా ఒకరికి అత్యాచారం చేశాడు.
ఈ విషయాన్ని ఓ విద్యార్థిని బహిర్గతం చేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్ కుమార్ వ్యవహారశైలిపై విచారణ చేపట్టారు. ఇందులో వ్యాయామం మాటున టీచర్ చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, రాజకీయ పలుకుబడి కలిగిన ఈ పీఈటీ మాస్టర్ రాజకీయ నేతల అండదండలతో కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.