1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (19:50 IST)

#2021NewYearCelebrations ఏపీలో రద్దు-31న, జనవరి 1న కర్ఫ్యూ

రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏడాది జరిగే డిసెంబరు 31, జనవరి 1న జరిగే కొత్త సంవత్సర వేడుకలను రద్దుచేసింది. ఆ రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి నిపుణులు పలు సూచనలు చేశారు. 
 
ఈ క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలను నిషేధించనున్నట్లు తెలిసింది. ఈ నెల 26 నుండి జనవరి 1 వరకూ అన్నీ రకాల వేడుకలు రద్దుచేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 31న, జనవరి 1న రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ విధించాలని యోచిస్తోంది.
 
రాష్ట్రంలో జనవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదము ఉందని కేంద్ర వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ నివేదక ఆధారంగా ఈ నెల మూడో వారం నుండి మరోసారి కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.